ధర్మశాల : సురేశ్ రైనా వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేశారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో రైనా 19 పరుగులు చేసి ఆ మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు భారత్ 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. గంభీర్ (24) ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో బెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.




