Monday, 2 November 2026

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
రేగోడు /జనం సాక్షి అక్టోబర్ :
పోలీస్ సంస్మరణదినోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన రేగోడ్ లొ సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డిఎస్పి సైదుల్ అల్లదురు సిఐ జర్జ్ తో కలిసి ప్రారంభించారు. ఎం ఎన్ ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీసుల సౌజన్యంతో ఈ వైద్య శిబిరానికి కొనసాగించారు. శిబిరానికి అపూర్వ స్పందన లభించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజాల సేవ చేయడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మణ్, ఎస్సై, సత్యనారాయణ జెడ్పిటిసి యాదగిరి, స్థానిక సర్పంచ్ బాదనపల్లి నరసింహులు, మాజీ ఎంపీపీ దిగంబరావ్,ఏ ఎస్సై మల్లయ్య, జమీందార్ రాచప్ప తదితరులు పాల్గొన్నారు