Monday, 2 November 2026

పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే

పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే
అమరులైన పోలీసులను గుర్తించడం గర్వకారణం
డీఎస్పీ సైదులు
రేగోడు/ జనం సాక్షి అక్టోబర్:
పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని పోలీసుల వద్ద గన్నులు తుపాకులు ఉన్న ప్రజలే పవర్ఫుల్ అని మెదక్ డిఎస్పి సైదులు అన్నారు. సోమవారం రేగోడ్ మండల పరిధి పోచారం గ్రామంలో పోలీస్ సంస్మరణ దినోత్సవల సందర్భంగా పోలీస్ రాములు అని నూతనంగా ఓ కాలానికి నామకరణం చేసిన సందర్భంగా అల్లాదుర్గం సీఐ జార్జి రేగోడు ఎస్సై సత్యనారాయణ తో కలిసి అక్కడికి చేరుకొని అమరుడైన పోలీస్ రాముల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పోచారం గ్రామానికి చెందిన రాములు పోలీస్ వృత్తిలో ఇద్దరు నక్సలైట్లను 1996లో నిజాంబాద్ జిల్లా కేంద్రమైన జైలుకు నలుగురు జవాన్లతో కలిసి బస్సులో తీసుకెళ్తుండగా బాన్సువాడ పరిధి మహమ్మద్ నగర్ వద్ద బస్సును ఆపి జవాన్ల వద్ద ఉన్న తుపాకులను గుంజుకున్నారన్నారు. రాములు నక్సలైట్లకు లొంగకుండా తుపాకులను ఇవ్వకపోవడంతో పాటు నక్సలైట్లతో పోరాడారన్నారు. దీంతో అతనిపై కాల్పులు జరిపి జైలుకు పంపాల్సిన నక్సలైట్లను తీసుకెళ్లినట్టు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన రాముల కుటుంబానికి గుర్తింపుగా పోచారం గ్రామంలో పోలీస్ రాముల కాలనీ అని నామకరణం చేయడం పోలీస్ వ్యవస్థకు గర్వకారణం అన్నారు. అమరులైన కుటుంబాలలో ఏ శాఖలలో ఉన్న ప్రభుత్వం వారి కుటుంబాలను గుర్తింపిస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పిస్తుంది అన్నారు కాగా ప్రతి ఒక్కరు పోలీసులతో పరోపకారంగా ఉండి సహాయం పొందాలన్నారు. యువకులు సమయాన్ని వృధా చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలన్నారు. ఈ సందర్భంగా అమరుడైన పోలీస్ రాముల భార్య సుందరమ్మకు శాలువాతో సన్మానించారు. సునీల్ కార్యదర్శిలకు డిఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై మల్లయ్య, జమిందార్ రాజప్ప పోలీస్ సిబ్బంది గ్రామస్తులు బాలయ్య, వెంకన్న, యాదగిరి, గొల్ల వీరన్న, తదితరులు పాల్గొన్నారు,