Tuesday, 3 November 2026

పోలీసుల రక్షణలో వివాదాస్పద కార్టూనిస్ట్

g0p2e555సిడ్నీ జనం సాక్షి : ఆస్ట్రేలియాకి చెందిన వివాదస్పద కార్టూనిస్టు లారీ పికరింగ్(72)కు ఆ దేశ పోలీసులు రక్షణ కల్పించారు. తన వెబ్సైట్లో పికరింగ్ ఓ కార్టూన్ పోస్ట్ చేసిన అనంతరం ప్రాన్స్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు క్వీన్స్లాండ్లోని పికరింగ్ను అతని ఇంట్లో కలిసి హెచ్చరించారు.  అతనిపై కూడా దాడి జరిగే ఆస్కారం ఉన్నందున ఉన్నత స్థాయి రక్షణ ఏర్పాటు చేశారు.

దీనిపై పికరింగ్ మాట్లాడుతూ.. తనకు రక్షణ కల్పించే అవసరం వస్తుందని కార్టూన్ పోస్ట్ చేసే ముందే ఊహించానని తెలిపాడు. తనకు సంబంధించిన వివరాలతోపాటు, ప్రత్యేక ఫోన్ నంబర్లను పోలీసులు తీసుకున్నట్లు పికరింగ్ స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *