పోలీస్‌ శాఖలో కొలువుల జాతర

– త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలు : ¬ం మంత్రి

హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడవిూలో ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ¬ం మంత్రి మహముద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అకాడవిూలో 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది ఎస్‌ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఎస్‌ఐలకు ¬ంమంత్రి, డీజీపీ పురస్కారాలు అందజేశారు. ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో సివిల్‌కు చెందిన 661 ఎస్‌ఐలు, ఐటీ కమ్యూనికేషన్‌కు చెందిన 28 మంది ఎస్‌ఐలు, 448 మంది ఆర్‌ఎస్‌ఐలు, ఫింగర్‌ ప్రింట్‌కు చెందిన 25 ఏఎస్‌ఐలు ఉన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్‌ఐలు ఉన్నారు. ఈ సందర్బంగా ¬ం మంత్రి మహముద్‌ అలీ మాట్లాడుతూ. పోలీసు అకాడవిూ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 18,428 మంది ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌ నియామకాలు జరిపామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రబుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. త్వరలోనే మరో 20 వేల పోలీసు నియామకాలు జరుపుతామని స్పష్టం చేశారు. కరోనా, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. పేదలకు సేవలు చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలన్నారు.

నేర రహిత సమాజమే లక్ష్యం : డీజీపీ

అనంతరం డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధతతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలన్నారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు నేరరహిత సమాజాన్ని కల్పించాలని చెప్పారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు, నియామకాలు జరిగాయన్నారు. పేదలకు న్యాయం లభించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అని తెలిపారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లోనూ పోలీసు శాఖ భాగస్వామ్యం కావాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు.