పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరించుకుందాం
జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శివ్వంపేట అక్టోబర్ 20 జనంసాక్షి :
విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమర వీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శివ్వంపేట ఎస్ఐ రవికాంత్ రావు ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల స్మారకోత్సవాలలో బాగంగా పోలీస్ అమర వీరుల జ్ఞాపకార్థం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలను తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్ తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. అంతకు ముందు జరిగిన సభలో పోలీస్ అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ విధుల్లో చేరిన పోలీసులు దేశ భద్రత కోసం, సమాజ శాంతి భద్రతల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని అలాంటి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీస్ అమర గుర్తు చేసుకోవడం కోసమే పోలీస్ అమర వీరుల స్మారక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు, యువతకు మన దేశంలో పోలీస్ శాఖ తరుపున దేశ భద్రత కోసం విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్, సీఐఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు తెలిసుండాలన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో 1997 నవంబర్ 17 న అప్పటి మాజీ సర్పంచ్ నాయిని గోపాల్ రెడ్డి ఇంటిని బాంబులతో నక్సలైట్లు పేల్చి వేయగా అక్కడికి కాలినడకన సిబ్బందితో వెళ్తున్న అప్పటి తూప్రాన్ డీఎస్పీ బాలసుబ్రమణ్యం, సీఐ వెంకటస్వామి, శివ్వంపేట హెడ్ కానిస్టేబుల్ పెంటయ్యతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్ ను పిల్లుట్ల శివారులోనే ఉన్న నక్సలైట్లు మందుపాతర పేల్చి చంపడం జరిగిందని ఆయన అన్నారు. అమర వీరుల పోలీస్ అమర వీరులను స్మరించుకోవడం కోసమే శివ్వంపేటలో వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజల శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం పేదలకు సేవలందించడం కోసమే పోలీసులుగా విధులు నిర్వహిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులకు న్యాయం జరగకుంటే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ వెంకటేశ్, మాజీ సర్పంచ్ స్రవంతి నవీన్ గుప్త, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, జడ్పీ స్కూల్ ఎచ్ఎం నారాయణమ్మ, విద్యా కమిటీ చైర్మన్ రాజీపేట నర్సింలు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.