పోలీస్ కృష్టయ్య 13 వ వర్ధంతి. పోలీస్ కృష్టయ్య 13 వ వర్ధంతి.
బూర్గంపహాడ్ డిసెంబర్ 01 (జనంసాక్షి)తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీస్ కృష్టయ్య 13 వ వర్ధంతి కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పోలీస్ కృష్ట్నయ్య అని కొనియాడారు. 2009 నవంబర్ 29 వ తారఖున కెసిఆర్ ఆమరణ దీక్ష ప్రారంభం చేసి కెసిఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదం తో మొదలైనప్పుడు ఆంధ్ర పెత్తం దారులు కుట్రలు పన్ని ఆ దీక్షను భగ్నం చేశారు. అవి చూసి విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని హాస్పిటల్ పాల్ అయ్యారు. ఇవన్ని కృష్ట్నయ్య చూసి చలించి పోయారు, ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న నేను అమరుడు అయితే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది అని లైసెన్స్ రివాల్వర్ తో సెల్ టవర్ ఎక్కి జై తెలంగణా అని కాల్చుకొని అమరుడు అయ్యాడని అన్నారు. ఆయన విగ్రహాన్ని టాంక్ బండ్ మీద పెట్టాలని బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దాసరి సాంబ, విద్యార్ది సంఘం అద్యక్షులు జమ్మి సాయి రామ్, రోహిత్, మండల బీసీ నాయకులు మహంకాళి అనంత రాములు, నాగరాజు, బహుజన నాయకులు, ముత్తయ్య, రవి, సతీష్ పాల్గొన్నారు
పోలీస్ కృష్టయ్య 13 వ వర్ధంతి. పోలీస్ కృష్టయ్య 13 వ వర్ధంతి.




