Tuesday, 3 November 2026

సత్తుపల్లి RC

సత్తుపల్లి RC ( జనం సాక్షి )సత్తుపల్లి RC ( జనం సాక్షి )ప్రపంచ ఎయిడ్స్  దినోత్సవ ర్యాలీ
కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్య సిబ్బంది, ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా డా”సురేష్ ఆధ్వర్యంలో మరియు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కిం సారధ్యంలో  గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ నివారణ అందరి బాధ్యత ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్  శ్రీ జన్య మాట్లాడుతూ”మనల్ని మనం పరీక్షించుకోవడం, హెచ్ఐవి ని అంతం చేయడానికి సమానతని సాధించడం అని పేర్కొన్నారు. ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు, అక్రమ లైంగిక సంబంధాల వలన కలిసిత రక్త మార్పిడి వలన ఎయిడ్స్ సంక్రమిస్తుందని పేర్కొన్నారు. చాప కింద నీరుల వ్యాపిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం మనందరి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని సమయంలో హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి ఎచ్ ఓ రేవతి,ఎచ్ వీ విజయశ్రీ,సూపర్వైజర్ రామారావు,పిఎచ్ఎన్ జయశ్రీ,ఎల్టి కంప్యూటర్ చార్లెస్, లింక్ వర్కర్ అనిల్ కుమార్,ఏఎన్ఎమ్, ఆశ, మరియు వైద్య సిబంది పాల్గొన్నారు.