గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 17 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి 7 పిర్యాదులు రాగ జిల్లా ఎస్పీ కె. సృజన స్వీకరణ నిర్వహించారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 7 మంది బాధితులు జిల్లా ఎస్పీ ని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం అర్జీలను సమర్పించారు. వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ప్రత్యక్షంగా ఫోన్ లో మాట్లాడి బాధితుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు అయినా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి అని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ముందస్తుగా బాధితుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించినచో చాలా వరకు జరగబోయే నేరాలను అరికట్టేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు, బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందించడానికి పోలీస్ స్టేషన్ సిబ్బంది కృషి చేయాలన్నారు,బాధితుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చేపడుతున్నా దర్యాప్తు పూర్వాపరాలను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియ జేయాలన్నారు.భూ వివాదాలకు సంభందించి 4 పిర్యాదులు,కుటుంబ తగాదాలకు సంభందించి 2 పిర్యాదులు,ఇతర అంశాలకు సంబంధించి 1 పిర్యాదు వచ్చినట్లు ఎస్పి తెలిపారు.




