Wednesday, 4 November 2026

నేరెళ్ల మహేందర్ ను బేషరతుగా విడుదల చేయాలి

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 17( జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం హుజురాబాద్ మండలంలోని చేల్పూర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ ను పోలీసులు అక్రమ అరెస్టు చేసి రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొనినేరెళ్ల మహేందర్ గౌడ్ పైన అక్రమ కేసు పెట్టి అతనికి జైలుకు పంపారు. వెంటనే ఆయనను బేషరతుగా విడుదల చేయాలని. చెయ్యని ఎడల రానున్న రోజుల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బత్తిని నరేష్ గౌడ్ నల్లగొని రమేష్ గౌడ్, తాళ్లపల్లి కుమార్ స్వామి బోంగొని సదానందం గౌడ్ పూదరి అనిల్ గౌడ్ కొండల్ గౌడ్ గట్టు కుమార్ రాజు తోపాటు గౌడ కులస్తులు పాల్గొన్నారు.