Tuesday, 3 November 2026

పోలీస్ ల ఆధ్వర్యంలో 5 కే రన్.

దౌల్తాబాద్ జూన్ 5, జనం సాక్షి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం దౌల్తాబాద్ పోలీసు ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ శివాజీ చౌరస్తా నుండి సూరంపల్లి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు. ప్రతిరోజు యోగా, రన్నింగ్, వాకింగ్, ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.