రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 5. (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఆధ్వర్యంలో కార్మికులు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పలువురు సేస్ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.
సెస్ ఉద్యోగుల భారీ ర్యాలీ.




