Thursday, 5 November 2026

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్… – పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి.

 

బై0సా రూరల్ జూన్ 12 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీసు శాఖ సోమవారం ఉదయం 6 గంటలకు పట్టణ కేంద్రంలో 2 కె రన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ శాసన సభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడారు. తెలంగాణలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని, దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్ర0 తెలంగాణనేనని అన్నారు. ఈ 2 కె రన్ కార్యక్రమంలో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో పాటు పోలీసు అధికారులు,యువత,నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.