వరంగల్ ఈస్ట్ జూన్ 11 జనం సాక్షిభారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మడత కాళిదాసు సేవలు చిరస్మరణీయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.శివనగర్ లోనీ మెట్లబావి ప్రాంతంలో యూనిక్ కిడ్స్ స్కూల్ లో స్వాతంత్ర్య సమరయోధులు మడత కాళిదాస్ విగ్రహావిష్కరణ , యూనిక్ కిడ్స్ హైస్కూల్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. పాల్గొన్నారు సభా కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త గట్ల రామ్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మడత కాళిదాస్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కోచ్ పార్టీ గురించి అవిశ్రాంత పోరాటం చేసిన నాయకుడు కాళిదాసు అని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కాళిదాసు నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావును కలిసి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని. తన జీవితాంతం వరంగల్ జిల్లా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావాలని ఇక్కడి నిరుద్యోగ సమస్య తీరుతుందని అలుపెరుగని పోరాటం చేశాడని బోయినపల్లి వినోద్ కుమార్ గుర్తు చేశారు.యూనిక్ హైస్కూలు నూతన భవనాన్ని ప్రారంభించి చైర్మన్ మడత రవి శ్రీలతలకు శుభాకాంక్షలు తెలిపి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మంచి పునాదులు వేయాలని కోరారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్రనాయకులు తాటిపాముల వెంకట్ రాములు, 34 డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఎం సి పి ఐ రాష్ట్ర నాయకులు నల్లపురెడ్డి ఉపేందర్ రెడ్డి ,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జన్ను జకార్య, మేడిపల్లి శోభన్ బాబు ,బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్సజనార్ధన్, ఐ ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదం శ్రీనివాస్ ప్రముఖ విద్యావేత్త ఆర్ షణ్ముఖ చారి, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం, ఐ వి నరసింహారావు ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కే భూపాల్ రావు , వడుప్సా జిల్ల అధ్యక్షులు చల్ల నాగార్జునరెడ్డి, అరసం పల్లేరు వీరస్వామి, సింగారం బాబు, బాబు రావు, బిల్లా రాజు తదితరులు పాల్గొన్నారు
సిపిఐ నాయకుడు మడత కాళిదాసు సేవలు చిరస్మరణీయం




