Tuesday, 3 November 2026

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి -జిల్లా ఎస్పీ కరణం సృజన.

గద్వాల నడిగడ్డ, జులై 2(జనం సాక్షి);శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతీ ఫిర్యాదు పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన 15 అర్జిలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు వచ్చిన పిర్యాదులలోభర్త వేదింపులకు సంబందించి 2 పిర్యాదులు,భూ వివాదాలకు సంబందించి 4 పిర్యాదులు,చీటింగ్ కు సంభందించి 1 పిర్యాదు,బెదిరింపులకు సంబందించి 2 పిర్యాదులు,ఫోర్జరీ కు సంబందించి 1 పిర్యాదు,దొంగతనం కు సంబందించి 1 పిర్యాదుఇతర అంశాలకు సంబంధించి 4 పిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు.