ఢిల్లీ జనంసాక్షి : భాజపా శాసనసభ్యుడు రఘునందన్ రావు దిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బండిసంజయ్ పుస్తెలు అమ్మ ఎన్నికల్లో పోటీ చేశాఅన్నారు. మరి వందకోట్లతో యాడ్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని.. పార్టీ అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా అని ఆయన ప్రశ్నించారు. ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని అన్నారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా వుంటుందో అందరికీ తెలుస్తుంది. రెండవసారి తాను దుబ్బకా నుంచి గెలుస్తానని అన్నారు. దుబ్బాకలో నా మొహం చూసే ఓటు వేశారని తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో తనకు ఎవరూ సాయం చేయలేదని తెలిపారు. తాను బీజేపీలోనే ఉండాలని కోరుకుంటున్నాఅని అన్నారు.
ఢిల్లీలో బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…




