Saturday, 7 November 2026

పోలీస్ స్టేషన్ పై పాఠశాల పిల్లలకి అవగాహన

పోలీస్ స్టేషన్ పై పాఠశాల పిల్లలకి అవగాహన…

భైంసా రూరల్ డిసెంబర్ 20 జనం సాక్షి

 

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని చైతన్య పాఠశాల విద్యార్థులు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో అధికారుల విధులు,అధికారుల పనితీరు,పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. ఏదైనా ఒక విషయాన్ని పిల్లలు వినడం ద్వారా కొద్ది వరకే నేర్చుకుంటారు. ఓ ప్రదేశానికి వెళ్లి స్వయంగా చూస్తూ,వినడం, ప్రశ్నలు అడుగుతూ తెలుసుకొనే కృత్యధార విధానం ద్వారా అది పిల్లలకి ఎక్కువ కాలం గుర్తుండిపోయే విధంగా ఉంటుందని ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవికుమార్ మరియు ఉపాధ్యాయులు లక్ష్మీకాంత్ నీలిమ ప్రీతి ప్రవీణ్ కుమార్ 6th టు టెన్త్ విద్యార్థులు పాల్గొన్నారు