Saturday, 7 November 2026

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్,నీల్వాయి ఎస్సై గోపతి నరేష్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులు గల మావోయిస్ట్  యాక్షన్ టీం సభ్యుల వివరాలతో ఉన్న వాల్ పోస్టర్లను కల్లంపల్లి,ముక్కిడిగూడెం,జాజులపేట,సుంపుటం,రాచర్ల గ్రామాల్లో అంటించారు.
మావోల అలజడిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మావోయిస్టు యాక్షన్ టీం ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని,ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.మావోయిస్టులు హింసాత్మక పద్ధతులతో సాధించేదేం ఉండదని,ఆయుధాలు వీడాలని పిలుపునిచ్చారు.ప్రజల అభివృద్ధికి నిరోధకులుగా మావోలు మారారనిఅన్నారు. మావోయాక్షన్ టీం సభ్యులు గాని అనుమానాస్పద వ్యక్తులుగాని కనిపిస్తే ప్రజలు స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ పాల్, బండి రాజన్న పాల్గొన్నారు.