Monday, 2 November 2026

పోషణ్ పక్వాడో డైట్ ప్లాన్ తో  ఆరోగ్యం

పోషణ్ పక్వాడో డైట్ ప్లాన్ తో  ఆరోగ్యంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): పోషణ్ పక్వాడో డైట్ ప్లాన్ తో ఆరోగ్యంగా ఉండవచ్చని సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డ్ కౌన్సెలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.శనివారం ఆ వార్డులోని అంగన్వాడీ కేంద్రం లో నిర్వహించిన పోషణ పక్వాడో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు, బడి ఈడు పిల్లలు ఆకు కూరలు, గుడ్లు, పాలు, పండ్లు,పప్పులు మొదలగు వాటిని తమ రోజు వారి డైట్ లో తీసుకోవాలన్నారు.బాలింతలు తమ శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. ప్రజలందరూ చిరు ధాన్యాలతో కొర్రల కిచిడీ, సామల పాయసం, రాగి మురుకులు, ఉదల ఇడ్లీ, అరికెల చెక్కలు మొదలగు వాటిని రోజులో ఒకపూట ఆహారంగా చేర్చుకుంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటూ, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమములో బాలాజీ నగర్ సెక్టార్ 1 సూపర్‌వైజర్ అనిత, అంగన్‌వాడీ టీచర్లు నిర్మల, శ్యామల, విజయలక్ష్మి ,ఏఎన్ఏంలు సుకన్య , పద్మ, లక్ష్మి, ఆశాలు జయమ్మ , లలిత, వార్డ్ మహిళలు అనిత, భారతి, విమల, లలిత, మల్లిక తదితరులు పాల్గొన్నారు.