Wednesday, 4 November 2026

పోషణ పక్వాడను విజయవంతం చేయాలి  సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు

 పెన్ పహాడ్ మార్చి 24 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు శుక్రవారం మండల కేంద్రానికి అక్ష్మీకంగా విచ్చేసి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ను పరిశీలించారు,అదేవిదంగా కస్తూరి భా గాంధీ బాలికల విద్యానిలయంలో రికార్డులను, విద్యార్థుల, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు అనంతరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ఐ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో సమస్యలు గురించి తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అన్ని గ్రామాల్లో పోషణ పక్వాడలో బాగాంగా అంగన్వాడీలు, మహిళా సంఘాల మహిళలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి పోషక ఆహారం తయారు చేసి అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరి రావు,ఇంచార్జి ఎంపీడివో బాణాల శ్రీనివాస్, ఇంచార్జి ఎంపీవో జానయ్య, ఎస్వో ఆసియా జెబినా,పంచాయతీ రాజ్ ఎఇ గోపి తదితరులు పాల్గొన్నారు…