గద్వాల నడిగడ్డ మార్చి 24 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాజెక్టు పరిధిలోని వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలో శుక్రవారం పోషణ పక్షం లో మిల్లెట్స్ పై అవగాహన సమావేశం నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ ఫరీదా తెలిపారు.
దేశంలో గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లల్లో వచ్చే రక్తహీనత మరుగుజ్జుతనం తక్కువ బరువుతో పుట్టడం వంటి పోషకాహార లోపాల్ని నివారించుట వారికి సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధి కి పోషకాహార పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించడం కోసం పోషణ పక్షంలో భాగంగా మిల్లెట్స్ పై అవగాహన సమావేశం నిర్వహించినట్లు ఆమె అన్నారు.సమావేశ అనంతరం రాగి లడ్డు దాని పోషక విలువలు అది ఎలా తయారు చేయాలో వాళ్లకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ వెంకటేష్, కృష్ణ, జయంతి ,ఆశ వర్కర్ లు, అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షంలో మిల్లెట్స్ పై అవగాహన సమావేశం




