Tuesday, 3 November 2026

పోస్కో ప్రాంతంలో బాంబు పేలుడు.. నలుగురి మృతి

భువనేశ్వర్‌ :ఒడిశాలో పోస్కో పరిశ్రమ నిర్మించ తల పెట్టిన జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా దింకియా మండలంలోని పటనా గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో పోస్కో వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు మనాన్‌జెనా (32), నాబను మండల్‌ (35), నరహరి సాహూ (52) లక్ష్మణ్‌ పరమానిక్‌ మృతి చెందినట్లు పోస్కో ప్రతిరోద్‌ సంఘం సమితి (పీపీఎన్‌ఎన్‌) తెలిపింది. అయితే పోస్కో వ్యతిరేక ఉద్యమకారులు బాంబు తయారు చేస్తుండగా పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పటనాలోని ఓ ఇంట్లో బాంబులు తయారు. చేస్తుండగా అవి పేలినట్లు తమకు సమాచారం ఉందని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా ఎస్పీ సత్యబ్రాతబోయి తెలిపారు. అయితే పోస్కో పరిశ్రమ మద్దతుదారులు జరిపిన దాడిలోనే తమ కార్యకర్తలు మృతి చెందారని పీపీఎన్‌ఎన్‌ అధ్యక్షుడు అభయ్‌సాహీ వెల్లడించారు. పోస్కో ప్రాజెక్టు కోసం భూసే కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ నేడు ప్రారంభించనుంది. దీనికి ఒక్కరోజు ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *