జనం సాక్షి , రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ తెలంగాణ చౌరస్తా లో రామగిరి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఈ నెల 5వ తేదీ నుండి చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. మంథని నియోజకవర్గ ప్రజల ను చైతన్య పరచడమే లక్ష్యంగా ఈ ప్రజా చైతన్య యాత్ర కు సునీల్ రెడ్డి శ్రీకారం బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోలుమూరి శ్రీనివాస్, జానీ భాయ్, మండల యువ నాయకులు తొట్ల రాజు , కుంట చక్రి, మెరుగు శ్రీకాంత్, కందుల రమేష్, రేణుకుంట్ల విజయ్, రాచమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ




