Thursday, 5 November 2026

పౌష్టికాహారం పంపిణీ

పౌష్టికాహారం పంపిణీ.
బెల్లంపల్లి, డిసెంబర్ 5, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సోమవారం బెల్లంపల్లి సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్ పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అన్ని విభాగాల్లో రాణించి లక్ష్యం సాదించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట ప్రవీణ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అభ్యర్థులు పాల్గొన్నారు.