హైదరాబాద్,(జనంసాక్షి):తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు ఒప్పుకోబోమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్యాకేజీలతోనే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, మళ్లీ ప్యాకేజీనే ఇస్తే ముందు కేడా తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని పేర్కొన్నారు.




