Wednesday, 4 November 2026

భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలే: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌ : భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అణ్వాయుధాలు పెంచుకుంటూ పోతే వాటి రక్షణ పెద్ద సవాలుగా మారుతుందన్నారు. 2017 వరకు ప్రపంచ దేశాలు అణ్వాయుధాలు తగ్గించుకుంటాయన్న నమ్మకం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *