–
కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు పెద్దపీట.-కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి11(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మైనార్టీలకు రిజర్వేషన్లను అమలు చేయడం లేదని మైనార్టీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబ్ తెలిపారు శనివారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సెల్ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులుగా మహమ్మద్ నిజాముద్దీన్ ప్రధాన కార్యదర్శిగా యూసుఫ్ కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులుగా బాలపీర్ తో అబూబకర్ లను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సిరాజుద్దీన్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి మూడు శాతానికి కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు.మైనార్టీ సంక్షేమానికి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మైనార్టీల సంక్షేమానికి ఒరగబెట్టింది ఏమీ లేదని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా పెళ్లిళ్లు జరిపించడం జరిగిందని వివరించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో అవినీతి రాజ్యమేలుతుందని సంక్షేమ పథకాలన్నీ ప్రకటనకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమానికి ఐదు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అని నిలదీశారు.స్వయం ఉపాధి నిధులను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. మైనార్టీ బందును ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని వచ్చిన వెంటనే 12శాతం రిజర్వేషన్లతో పాటు గతంలో ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని మైనార్టీ నాయకులను కోరారు ఈ సమావేశంలో వివిధ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు.




