Wednesday, 4 November 2026

ఘనంగా మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు.

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 11శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ తూముల శ్యామ్ రావు జన్మదిన వేడుకలను శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు . శ్యామ్ రామ్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండలములోని కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహo చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, కాచాపూర్ సర్పంచ్ కొండ్ర రాజయ్య, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శివకుమార్, కేశవపట్నం రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ కొత్తపల్లి రవి, పార్టీ నాయకులు శ్రీనివాస్, కోటిలింగం, వెంకటేశం, నంది రెడ్డి, యూత్ నాయకులు నాంపల్లి శ్రీధర్, వెంకటేష్, ప్రవీణ్, తో పటు నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.