Wednesday, 4 November 2026

ప్రకటనలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం – రైస్ మిల్లర్ల దయ దక్షిణ్యాల పైన రైతులు ఆధారపడే విధంగా ఉండద్దు – ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించి కొనుగోలు కేంద్రములో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే పూర్తిస్థాయిలో కొనాలని చెప్పిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది అని , నెల రోజులు గడిన కూడా కాంటలను కావడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మంథని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఒకటే లారీ లారీలు పంపియాలని రైతులు కాంట్రాక్టర్ నీ అడిగితే ఒక్కటి కూడా పంపియం ఏం చేసుకుంటావో చేసుకో అని కాంట్రాక్టర్ ఎ రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ఇప్పటికైనా కాంటాలు ఏర్పాటు చేసి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సెంటర్ లో జరుగుతున్న అన్యాయం గురుంచి తాలు పేరుతో ప్రతి బ్యాగు కి రెండు కిలోల చొప్పున వడ్లను కట్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని అన్నారు. రవాణా సౌకర్యం లేదు వర్షం వస్తె టార్పిలినుల్లు లేవని, ఇప్పటికైనా కాంటాలు ఏర్పాటు చేసి తక్షణమే రైతులకు న్యాయం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్, శశిభూషణ్ కాచే, కౌన్సిలర్ పెన్డ్రు రమ రెడ్డి తదితరులు ఉన్నారు.