హుజూర్ నగర్ మే 23 (జనంసాక్షి):
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ )నిర్వహించిన సివిల్ సర్వీసెస్- 2022 తుది పలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలలో హుజూర్ నగర్ సీతారాం నగర్ కు చెందిన నూకల ఉమా హారతి ఆల్ ఇండియా మూడో ర్యాంక్ సాధించింది. ఉమా హారతి హైదరాబాదులో ఐఐటి పూర్తి చేసి తన నాలుగో ప్రయత్నంలో ఈ ఘనత సాధించిందని తెలిపింది. ఉమా హారతి సోదరుడు సాయి వికాస్ 2021 సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో జాతీయస్థాయిలో 12 ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసి ఈనెల 22న విధుల్లో చేరాడు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమా హారతి ఆల్ ఇండియా సాధించడం పట్ల హుజూర్ నగర్ పట్టణ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ సర్వీస్ లో మూడో ర్యాంకు సాధించిన ఉమా హారతి




