Tuesday, 3 November 2026

ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

అడ్డుకుని గోషామహల్‌ తరలించిన పోలీసులు
హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): ప్రగతి భవన్‌ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై ఆందోళనకు దిగారు. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని…రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1లక్ష 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కాగా ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. నిరుద్యోగులను అరెస్ట్‌ చేసిన పోలీసులు గోషామహల్‌కు తరలించారు.