ప్రగతి,సంక్షేమం దిశన రాజ్యాంగం! ———————————————- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని గ్రీన్ పార్కులో బి.ఆర్ అంబేద్కర్ కాశ విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంబంధించి అనేక చట్టాలను రాజ్యాంగంలో పొద్దపరిచారని పేర్కొన్నారు. కాళీ దేశంలోని మతోన్మాద శక్తులు భారతరత్న అంబేద్కర్ రాజ్యాగాన్ని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ అనే మహానీయుడు ఓ కులానికి ఓ వర్గానికి చెందిన వాడు కాడని సకల జనుల ప్రయోజనాల కోసమే పాటుపడ్డ మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ అనే మహనీయుడు మన దేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణమని తెలిపారు. ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థ ఏర్పడడానికి ముఖ్యకారకుడు అంబేద్కర్ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బ్రతికున్నంత కాలం ఈ దేశ అభ్యున్నతి ప్రజల కోసమే పాటుపడిన త్యాగశీలి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారంటే ఎంతటి గొప్ప వ్యక్తితో అర్థం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ మరణించిన రాజ్యాంగ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పారు. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని చట్టాలు రూపొందించాలన్నారు. కొన్ని వర్గాలకు చెందినటువంటి రాజ్యాంగ ఏతర శక్తులు రాజ్యాంగం లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ మహనీయుని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై అవాకులు చేవాకుల పే లు తున్న మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. పంచశీల జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మందమరి జిఎం చింతల శ్రీనివాస్ సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు కనుకుల తిరుపతి జీడి బాబు సుదర్శన్ వాసాల శంకర్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి,సంక్షేమం దిశన రాజ్యాంగం




