సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై ఉద్యమిద్దాం
— జాతీయ కార్యదర్శి పి. కృష్ణ ప్రసాద్
మోత్కూరు డిసెంబర్ 5 జనంసాక్షి : ఆల్ ఇండియా కిసాన్ సభ 35వ జాతీయ మహాసభల సందర్భంగా తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్తూపం కడవెండి నుండి మొదలైన అమరవీరుల జ్యోతి బస్సు యాత్ర మోత్కూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి పి.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ 13 నుండి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో జరిగే 35వ జాతీయ కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు 500 రైతుసంఘాల ఐక్యపరిచి సమరశీల పోరాటాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడల వంచి మూడు నల్ల చట్టాలను రద్దు చేయించిన ఘనత రైతు ఉద్యమానికి ఉందని తెలిపారు.
కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా రైతాంగానికి ,పంట గిట్టుబాటు ధరల కోసం,
కనీస మద్దతుల చట్టం చేయాలని, వ్యవసాయ పంటలు నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా పథకం అమలు చేయాలని , రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, రాబోయే కాలంలో మహత్తర రైతాంగ పోరాటాలను సమరశీల ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. మోత్కూరు పట్టణంలోని బిక్కేరు బ్రిడ్జి నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
టీ మేనేజర్ ప్రకాశం మాస్టర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, శ్రీ జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ,బొంతు రాంబాబు సాదినేని రమేష్, లెల్లెల బాలకృష్ణ, సిపిఐ రైతు సంఘం నాయకులు పైల్ల యాదిరెడ్డి, పైల్ల రామ్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకట నర్సు, సీపీఎం పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, బొడ్డుపల్లి వెంకటేష్, సిఐటియు నాయకులు కూరెళ్ల నరసింహ,రైతు సంఘం జిల్లా నాయకులు బోయిన ఆనంద్, వేముల బిక్షం కందాటి సత్తిరెడ్డి ,పాటి శ్రీనివాస్ రెడ్డి ,పామనగుల్ల రమేష్ సామా శ్రీనివాసరెడ్డి, నూకల భాస్కర్ రెడ్డి, చింతల కృష్ణారెడ్డి కందుకూరి నరసింహ, బోయిని ఆనంద్ వేముల బిక్షం తదితరుల పాల్గోన్నారు.




