హుజూర్ నగర్ జులై 4 (జనంసాక్షి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను వెనక్కి నెట్టేందుకు ప్రజలంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపుపాండు ప్రజలకు పిలుపునిచ్చినారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 12 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపకానికి దొడ్డి కొమరయ్య మరణం ప్రధాన కారణమని, ఆనాడు ఈ పోరాటంలో 4000 మంది అమరులయ్యారు అన్నారు. వారికి సిపిఎం పార్టీ ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, పాశం వెంకటనారాయణ, అబ్రహం, చిన్న వీరమల్లు, చింతకాయల శంభయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు. 
ప్రజలంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి




