మల్కాజిగిరి. జనం సాక్షి. జులై 4నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు దొడ్డి కొమరయ్య అని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షుడు జోగు వెంకటేష్,ప్రధాన కార్యదర్శి మీరాళం రామచందర్ పేర్కొన్నారు.దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతి వేడుకల సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిని వారి చేతిలో నుంచి విముక్తి కల్పించి పేదలకు పంచిన పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.ఈకార్యక్రమంలో ఒగ్గు చంద్రశేఖర్,ఒగ్గు మురళీకృష్ణ,ఆసర్ల శ్రీకాంత్,కుమారస్వామి,పరంధాములు, కొమురయ్య,వెంకటేష్,సుధాకర్, జానయ్య తదితరులు పాల్గొన్నారు. 
ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు.




