Thursday, 5 November 2026

ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి..!

– అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్స్ ఇవ్వండి..!

– మోహన్ రావ్ పాటిల్…

భైంసా రూరల్ జనవరి 17జనం సాక్షి

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలని… రజాకార్ల పాలన విడి… అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని ముధోల్ నియోజక వర్గ బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు.మంగళవారం బై0సా మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించి అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి రెండు పడకల గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న బై0సా మండల వ్యాప్త పేదలతో కలిసి ర్యాలీగా వెళ్లి మండల తహసీల్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తహసిల్దార్ రావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో రాస్తారోకో స్థలానికి రాగా… వినతిపత్రం సమర్పించారు. ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు. అనంతరం మోహన్రావు పటేల్ మాట్లాడుతూ…. గత నవంబర్ లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రను బిఆర్ఎస్ గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, రజాకార్ల పాలనను అవలంబిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల పదవీకాలం ముగుస్తున్న పేదలకు మాత్రం ఇచ్చిన హామీ నెరవేర లేదని
ఆ తర్వాత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. మళ్లీ మాట మార్చి మూడు లక్షలు రూపాయలు ఇస్తామని చెబుతుండడం పేదప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పేదప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అర్హులైన పేద ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్, గాలి రవి, నాయకులు సుభాష్ పటేల్,శ్రీనివాస్,లక్ష్మన్,పోషేట్టి తదితరులు వున్నారు.