Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి

 కొండమల్లేపల్లి జనవరి 17 (జనం సాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం నాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సర్వసభ్య సమావేశం లో వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ, ఉపాధి హామీ, ఐసిడిఎస్, విద్యుత్ శాఖ, రహదారులు మరియు భవనముల శాఖ, ఇరిగేషన్ శాఖ, ఐకెపి, ఫిషరింగ్, సివిల్ సప్లై, మండల రెవెన్యూ శాఖ, మండల విద్యుత్ శాఖ, ఏపిఎం, డి ఆర్ డి ఏ సెర్ప్ , ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ శాఖ,ఇరిగేషన్ సబ్ డివిజన్ శాఖ, విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ, ల మీద సమీక్ష సమావేశాలు జరిగాయి వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొని వారి శాఖలకు సంబంధించిన వివరాలు అధికారులకు ప్రజాప్రతినిధులకు చాలా క్లుప్తంగా సరళంగా వివరించారు ఏయే శాఖలలో అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయో వాటిని ఇంకెప్పుడు పూర్తి చేస్తారో సర్వసభ్య సమావేశంలో వివరించారు మండలం లోని వివిధ అభివృద్ధి శాఖలకు సంబంధించిన ఏమైనా అభివృద్ధి పనులు ఆటంకాలు ఉన్నాయో మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు వారి గ్రామాల పట్టణాల సమస్యలను సర్వసభ్య సమావేశ దృష్టికి తీసుకువచ్చారు ఏఏ గ్రామాలలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో ఏఏ గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు కావాలో ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో చెప్పారు మరియు కొన్ని గ్రామాలలో పడకేసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజాప్రతినిధులు సూచించారు ఏఏ గ్రామాలలో సమస్యలు ఉన్నాయో అధికారులు నోట్ చేసుకుని త్వరలో పనులకు ఆటంకాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటామని సూచించారు సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది చాలా సమస్యలు పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రజాప్రతినిలు వాపోయారు పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు మండల సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు ఏ సమస్యలు రాకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె కోరారు మండలంలోని ప్రజలకు అవసరమయ్యే ఏ విషయాలలో కూడా రాజీ పడబోమని మండల అధికారులకు సూచించారు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమయాభావంతో ప్రజలకు అవసరమే అన్ని పనులు పూర్తి చేయాలని ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో కొండమల్లేపల్లి జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ, ఎంపీడీవో బాలరాజు రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వినోద్, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ శివ గౌడ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండలంలోని అన్ని శాఖల ఏఈలు, మండలంలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు