అలంపూర్ మే 13 జనంసాక్షి.గ్రామాల్లోని ప్రజలలో గుణాత్మకమైన మార్పు రావాలని, అలంపూర్ శాసనసభ్యులు అబ్రహం అన్నారు. మానపాడు మండలంలోని చండూరు గ్రామంలో శనివారం నూతన రేషన్ డీలర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులకు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామ స్వరాజ్యంపై లోతైన అధ్యయనం చేసి నూతన చట్టాని రూపొందించినారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకకూడదనే ఉద్దేశంతో మండలంలోని చండూరు గ్రామంలో నూతన రేషన్ డీలర్ షాప్ ను ప్రారంబించడమైనది అని తెలిపారు. గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని అభిప్రాయ పడ్డారు. నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన ద్వారా నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసే దిశగా చిన్న చిన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలకు బాగా సేవలందించే విధంగా మన ముఖ్యమత్రి కెసిఆర్ రూపొందించారన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ, మద్దిలేటి,ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు, అజయ్ అన్న సేవా దళం సభ్యులు మరియు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు..




