Thursday, 5 November 2026

తగ్గేదేలే. కొనగా.గుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె

 

 

 

 

 

 

 

 

 

బిచ్కుంద మే 13 (జనంసాక్షి)తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మె గత 15 రోజులుగా కొనసాగుతోంది. రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి బీఆర్ఎస్ సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. పైగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సెక్రటరీలకు రాజకీయ పార్టీల, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. గత సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సెక్రటరీల సమ్మెకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మద్దతు తెలిపారు. సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మద్దతు తెలిపారు. 4 ఏళ్ల నుంచి రోజుకు 12 గంటల కష్టపడుతూ రాష్ట్రానికి అవార్డులు రావటంలో కీలకపాత్ర పోషించిన సెక్రటరీలను సీఎం కేసీఆర్ రెగ్యులర్ చేయాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.