Thursday, 5 November 2026

ప్రజల్లో క్షయ పై అవగాహనను పెంపొందించాలి

 హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): ప్రజల్లో క్షయ వ్యతిరేక కార్యక్రమాన్ని భారీ ఉద్యమంగా మార్చి అవగాహనను పెంపొందించాలని డాక్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ వో నిరంజన్ అన్నారు. టిబి ముక్తుభారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుజూర్ నగర్ లో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరంలో మండల వైద్యాధికారి డాక్టర్ సన పాల్గొని మాట్లాడుతూ క్షయ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు ప్రభావవంతమైన చికిత్స అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. క్షయ వ్యాధిని కొందరు కలంకంగా భావిస్తున్నారని ఈ భ్రమను పోగొట్టుకొని చుట్టుపక్కల రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, బరువు తగ్గటం, ఆకలి మందగించడం, తెమడ లో రక్తజీరలు వంటి లక్షణాలు కలిగినటువంటి వారు మీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయిచుచుకోవాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత మందులు, రోగులకు పోషకాహార నిమిత్తం నెలకు 500 రూపాయలు వారి చికిత్స కాలంలో ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, పిహెచ్ఎన్ నూర్జహాన్ బేగం, ఎస్టిఎల్ఎస్ అరుణ, హైమావతి, ల్యాబ్ టెక్నీషియన్ గూడెపు రమేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.