Thursday, 5 November 2026

క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు.

 

కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-ఉమ్మడి కోటగిరి మండలంలోని పోతంగల్ ఎత్తోండ గ్రామాలలో మంగళవారం క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాలలోనీ ప్రధాన వీధుల గుండా క్షయ వ్యాధి నివారణపై స్లొగేన్స్ చేస్తూ గ్రామ ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించా రు.ఈ కార్యక్రమానికి డాక్టర్ కరమ్,డాక్టర్ సుప్రియ హాజరై క్షయ వ్యాధి లక్షణాలను వివరిస్తు,క్షయ నివారణకై పలు సూచనలు చేశారు.అలాగే క్షయ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నామన్నారు.క్షయ వ్యాధికి ఉచితంగా మందులు,పౌష్టికాహార తీసుకునేందుకు నెలకు రూ.500 చొప్పున పేషంట్ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం వేస్తుందనీ వారు తెలిపారు.ఈ అవగాహన సదస్సులో ఉమ్మడి మండల నోడల్ అధికారి కృష్ణవేణి,సూపర్వైజర్స్ జ్యోతి,సాయి కుమారి ఏఎన్ఎమ్స్,ఆశలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.