ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదిను అధికారులు పరిష్కరించాలి
-జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 5 (జనం సాక్షి);
ప్రజల నుండి పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ప్రజావాణిలో లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజల నుండి వచ్చిన 7 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబందించిన సివిల్ వివాదాల విషయంలో ఎవరుకుడా పోలీస్ స్టేషన్ లకు తిరుగుతూ తమ సమయాన్ని వృదా చేసుకోవద్దని, సివిల్ వివాదాలు పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్ని గ్రహించాలని, సివిల్ వివాదాలు కోర్టులలో పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.భార్య భర్తల విషయంలో చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకొని ఒకరి పై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, కుటుంబాలను దూరం చేసుకోవడం వంటి సంఘటనల పై జిల్లా ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యల విషయంలో ఇరువురిని కౌన్సిలింగ్ సెంటర్ కు పంపి కౌన్సిలింగ్ చేయాలనీ జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. అధికారులు మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సోమవారం వచ్చిన ఫిర్యాదులలో
భర్త వేధింపులకు సంబంధించి 1 పిర్యాదు,భూ వివాదాలకు సంభందించి 5 ఫిర్యాదులు,
ఇతర అంశాలకు సంబంధించి 1 ఫిర్యాదు వచ్చిందని ఎస్పీ తెలిపారు.
ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదిను అధికారులు పరిష్కరించాలి




