Wednesday, 4 November 2026

ప్రజల మన్ననలు పొందుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్దకల్

ప్రజల మన్ననలు పొందుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్దకల్

మల్దకల్ జనవరి 9 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు సాధారణ డెలివరీలు అయినట్లు మెడికల్ ఆఫీసర్ స్వరూప తెలియజేశారు.డిసెంబర్ నెలలో 31 డెలివరీలు,ఒకటవ తారీకు నుండి ఇప్పటివరకు ఏడు డెలివరీలు చేసినట్లు డాక్టర్ తెలియజేశారు.గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు డిసెంబర్ నెలలో 120, ఈ నెలలో 40 కిట్లు ఇచ్చి వారికి ఎలా వాడాలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటస్వామి,హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్,స్టాఫ్ నర్స్ మునెమ్మ,పుష్పరేఖ, ఏఎన్ఎం మరియమ్మ పాల్గొన్నారు.