లోకేశ్వరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్న,రాస్తారోకో…
భైంసా రూరల్ జనవరి 09 జనం సాక్షి
ముధోల్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులుభోస్లేమోహన్ రావ్ పాటిల్ఆధ్వర్యంలో సోమవారం లోకేశ్వరంమండల కేంద్రంలోడబల్ బెడ్రూమ్స్ రాని బాధితప్రజలతో సభను ఏర్పాటుచేసి వారు పడుతున్నబాధలను తెలుసుకున్నారు.సభలో మాట్లాడారు….అర్హులైనపేద ప్రజలకుతక్షణమే డబుల్ బెడ్రూంఇంటినికేటాయించాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.గతరెండుఎన్నికల నుండి కె.సి.ఆర్ అబద్ధాలకు పేదప్రజలే బలిఅవుతున్నారని అన్నారు.స్థలంఉన్న పేదలకు డబుల్ బెడ్రూంఇల్లుకట్టిస్తామని, జాగాకూడా లేని పేదలకు తామే ఇల్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చి, మొన్నటికి మొన్న ఇంటి నిర్మాణం నిమిత్తం 5 లక్షలు ఇస్తామంటూ,దాన్ని కూడా మార్చి ఇప్పుడు 3 లక్షలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
అనంతరం సభాస్థలి నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగావెళ్ళీ,రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోచేసి, మహాధర్నాచేపట్టారు.అర్హులందరికీ డబల్ఇండ్లు ఇవ్వాలంటూ… ఎమ్మార్వో రావాలంటూ నినాదాలుచేస్తూ రోడ్డుపైబైఠాయించారు.ధర్నా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది కి అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలంటూ వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలోముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్,కౌన్సిలర్ దిలీప్,గాలిరవి, బిజెపి నాయకులు నగర్ నారాయణరెడ్డి,సుభాష్ పటేల్,మనోజ్,రామకృష్ణ,భూమయ్య,మహేందర్ రెడ్డి,సాయినాథ్ పాటిల్,అనిల్,నరహరి,పోతన్న కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




