Tuesday, 3 November 2026

ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్4.
ప్రజల సంక్షేమం,అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని బాల సరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజిగిరి,మహంకాళి టెంపుల్ ప్రాంతాలలో హాథ్ సే హాథ్ జొడో యాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.బిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ,
సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 కే వంటగ్యాస్ సిలిండర్,ఏక కాలంలో రెండు లక్షల రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లను నెరవేర్చడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిడి శ్రీనివాస్,వెంకటేష్ యాదవ్,గుత్తి రామ్ చందర్,రాములు, సత్యనారాయణ గౌడ్,సురేష్ యాదవ్, రాజేష్ గౌడ్,నరహరి గౌడ్,విటల్, నరసింగరావు,మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.