Friday, 6 November 2026

ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం

 

 

 

 

 

 

 

– మాజీ మంత్రి కొండా సురేఖ

32వ డివిజన్లో పాదయాత్ర

వరంగల్ ఈస్ట్, మార్చి 16 (జనం సాక్షి)

ప్రజల సమస్యలు తీర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ తూర్పు నియోజక వర్గంలోనీ 32వ డివిజన్ లోని నాగమల్ల సందీప్, నిఖిల్, రంజిత్ శివరాజ్ ఆధ్వర్యంలో కరీంబాద్, సాకరాసికుంట, బి ఆర్ నగర్, బీరన్నకుంట రాజీవ గాంధీ నగర్ నుంచి  హత్ సే హత్ జోడో యాత్ర  మొదలై ప్రజలను  కలుస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ డివిజన్లో కొండా సురేఖ మురళీధర్ రావు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకెజిటూ పీజి, ఎంసెట్ ఫలితాలు, గ్రూప్ టూ, టి.ఎస్.పి.ఎస్.సి అన్నీ లేకులే అన్నారుప్రజా సమస్యలు గాలికి వదిలేసి కవితను కాపాడడానికి హస్తినకు వెళ్లారు అని విమర్శించారురాష్ట్రంలో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నిర్ముస్తే అభివృద్ధి అయ్యినట్టా అని చెప్పారు

కెసిఆర్ చేతిలో ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు కీలు బొమ్మలు అయ్యారని విమర్శించారు

తూర్పు నియోజక వర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఎలుతుంది అన్నారుకబ్జాలకు పాల్పడుతూ కార్పొరేటర్లు డివుజన్లో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు అని సురేఖ మురళీధర్ రావు చెప్పారు

ఉర్సు గుట్ట బి. ఆర్. నగర్ కొండా దంపతుల హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తూర్పులో ప్రతీ పేదవాడికి పక్కా ఇండ్లు సాధ్యం అన్నారు

ఎండాకాలం ముంచుకోస్తున్నా నగరంలో మంచి నీటి సమష్య పరిష్కారంకు ప్రణాళికలు లేవు అని చెప్పారు ప్రజల సమస్యలన్నీ తీరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల ప్రకాష్ నల్గొండ రమేష్ షేర్ల కిషోర్ నారగోని మురళి మడిపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు