వేములవాడ రూరల్, మార్చి 16 (జనంసాక్షి) : ప్రభుత్వం అందించే మైనార్టీ రాయితీ అర్హులైన వారికోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు గురువారం వేములవాడ గ్రామీణ ఎంపీడీవో రామ్ రెడ్డి తెలిపారు. మైనార్టీల సబ్సిడీలకై ఇంతకుముందు ఆన్లైన్లో నమోదు చేసుకున్న మైనార్టీ యువతి, యువకులు ఈనెల 18న ఉదయం 11 గంటలకు గ్రామీణ మండల పరిషత్ కార్యాలయంలో తమ ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు.
మైనార్టీ రాయితీలకు ఇంటర్వ్యూ




