Wednesday, 4 November 2026

ప్రజారంజకంగా టీఆర్‌ఎస్‌ పాలన: బాలరాజు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పాలన ప్రజారంజకంగా ఉంటుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. ప్రజలలో టీఆర్‌ఎస్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తమకు పూర్తిస్థాయి నిర్మాణం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ అగ్రగామిగా పార్టీగా ఉందని తెలిపారు. అన్ని జిల్లా, మండల కమిటీల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *