హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీకి ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 14 రకాల వంటకాలను సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. 36 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ.. 50 వేల మందికి భోజనాల ఏర్పాట్లు చేశామంటున్నారు. 15 వేల మంది క్యాటరింగ్ సిబ్బంది పని చేస్తుందని తెలిపారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలున్నాయని పేర్కొన్నారు. చికెన్, మటన్ తో సహా 5, 6 డిషెస్ ఉన్నాయని చెప్పారు. ప్లీనరీ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం అవుతుందని తెలిపారు.



