నల్గొండ జిల్లాలో వర్షం బీభత్సం
నల్గొండ: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలో పలు చోట్ల కురిసిన ఆకాల వర్షానికి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నేలపాలైంది. వర్షం బీభత్సానికి మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కల్లాలోని ధాన్యం పూర్తిగా తడిసిముద్దయ్యింది. ఇటు మార్కెట్లలోని ధాన్యం కూడి తడిసిపోవడంతో అన్నదాతలు బోరునవిలపిస్తున్నారు. హుజుర్‌నగర్‌లోని ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు నేలపాలయ్యాయి. హుజుర్‌నగర్‌లో పిడుగుపాటుకు కామేశ్వరి అనే మహిళ మృతిచెందింది. ఈదురుగాలుల దెబ్బకు ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మేళ్ళ చెరువు తహశీల్దార్ కార్యాలయలో షాట్ సర్య్కూట్‌తో కంప్యూటర్లు కాలిపోయాయి.